టీచింగ్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వారికి,ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగులకు శుభవార్త. దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో 1377 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో female స్టాఫ్ నర్స్ 121, men హెల్పర్ 442, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 381, ల్యాబ్ అటెండెంట్ 161 సహా మరికొన్ని పోస్టులు ఉన్నాయి. వేర్వేరు పోస్టులను బట్టి టెన్త్ నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్నాయి. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ పరీక్ష తేదీలు వెల్లడి కానున్నాయి.
నవోదయ విద్యాలయ సమితి లో ఉద్యోగులకు నిబంధనల మేరకు వయో సడలింపు వర్తిస్తుంది.ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీల వారీగా 10-15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని పరీక్ష కేంద్రాలలో నిర్వహిస్తారు.