ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగ ఈ ఎన్నికల ప్రచారంలో యోగీ ఇచ్చిన హామీలను నెరవర్చడానికి యూపీ సర్కారు సిద్దం అవుతుంది. యోగీ సర్కారు వారు ఇచ్చిన హామీలల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఒకటి. కాగ ఈ హామీని నెవర్చడానికి హోలీ రోజును యోగీ ప్రభుత్వం మూహుర్తంగా ఫిక్స్ చేసింది. హోలీ సందర్భంగా కోటి మంది అర్హులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద ఉత్తర ప్రదేశ్ లోని అర్హులకు ఈ సిలిండర్లు అందనున్నాయి. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కోసం.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఇప్పటికే అధికారులతో చర్చలు ప్రారంభించారు. హోలీ పండుగ రోజే.. గ్యాస్ సిలిండర్లు ను ఇవ్వాలని యూపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
అలాగే పలు హామీలను కూడా అమలు చేయాడానికి యోగీ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. చదువుల్లో రాణిస్తున్న విద్యార్థినులకు.. స్కూటీలు పంపిణీ చేయడంతో పాటు, 60 ఏళ్లు దాటిని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను కూడా అమలు చేయాలని యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.