ప్రభుత్వం సంచలన నిర్ణయం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే 10 వేల ఫైన్

-

బైక్ డ్రైవ్ చేస్తూ… సెల్ ఫోన్ మాట్లాడే వారికి ఎన్ని విధాలుగా చెప్పినా సరే వారిలో మార్పు రాదు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా సరే మా ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటారు కొందరు. అలాంటి వారికి ఫైన్ వేసినా సరే మార్పు రాదు. వాహనాలు లాక్కున్నా సరే మార్పు అనేది కనపడదు… తాజాగా అలాంటి వారికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.

మోటార్ సైకిల్ పై ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే పది వేల రూపాయల ఫైన్ వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది ఆ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు సార్లు పది వేల ఫైన్, మూడో సారి దొరికితే బండి సీజ్ చేసి రెండేళ్ళ పాటు జైలు శిక్ష, లక్ష రూపాయల ఫైన్ విధిస్తామని స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు కూడా ఇదే కారణం అనే ఆందోళన ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news