ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా అన్‌లాక్ 3.0 ప్రక్రియ అమలులోకి రానున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆగస్టు 5 నుంచి జిమ్‌లు, యోగా సెంటర్లను తెరుచుకునేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే ఆయా సెంటర్లకు వెళ్లేవారు కచ్చితంగా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి. ఆయా ప్రదేశాలకు వెళ్లే ముందు, వెళ్లి వచ్చాక కచ్చితంగా పలు జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. దీంతో కోవిడ్ బారిన పడకుండా చూసుకోవచ్చు.
1. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మీరు కచ్చితంగా జిమ్‌కు వెళ్లాలి అనుకుంటేనే వెళ్లండి. వీలైనంత వరకు ఇంట్లోనే వ్యాయామం చేసుకునేందుకు యత్నించండి. కుదరదు.. అనుకుంటేనే జిమ్‌కు వెళ్లండి. జిమ్‌కు వెళ్లినప్పుడు కచ్చితంగా కోవిడ్ జాగ్రత్తలను పాటించండి.
2. జిమ్‌కు వెళ్లేముందు, వెళ్లి వచ్చాక చేతులను సబ్బు లేదా హ్యాండ్‌వాష్‌తో శుభ్రంగా కడుక్కోవాలి.
3. జిమ్‌లో ఎక్కువ మంది ఉన్న చోట ఎక్సర్‌సైజ్‌లు చేయకండి. భౌతిక దూరం నిబంధనను తప్పనిసరిగా పాటించండి.
4. వ్యాయామం చేసేటప్పుడు కచ్చితంగా మాస్కులను ధరించండి. కాకపోతే హై ఇంటెన్స్ కార్డియో ఎక్సర్‌సైజ్‌లను చేయకండి. ఎందుకంటే అవి చేస్తున్నప్పుడు శ్వాస ఎక్కువగా పీలుస్తారు కనుక.. మాస్క్ అడ్డుగా ఉంటే శ్వాస సరిగ్గా తీసుకోలేరు. కనుక జిమ్‌లోనూ తేలికపాటి వ్యాయామాలే చేయండి.
5. జిమ్, యోగా సెంటర్లు కచ్చితంగా సబ్బు, హ్యాండ్ శానిటైజర్లను కస్టమర్లకు అందించాలి. అలాగే వారు భౌతిక దూరం పాటించేలా చూడాలి. జిమ్ ఎక్విప్‌మెంట్‌ను శుభ్రం చేసేటప్పుడు లేదా కస్టమర్లు వాడినప్పుడు వాటిని కచ్చితంగా శానిటైజ్ చేయాలి.
6. కస్టమర్లు జిమ్ నుంచి బయటకు వచ్చేముందు శుభ్రమైన దుస్తులు ధరించాలి. అందుకు గాను ఒక జత దుస్తులను వారు జిమ్‌కు వెళ్లేముందే తమతో తీసుకెళ్లాలి.
7. జిమ్‌లోని అన్ని పరికరాలను, ఫ్లోర్లను యాజమాన్యం కచ్చితంగా నిత్యం పలుమార్లు శానిటైజ్ చేయాలి.