ఈసారి మోదీ మెజార్టీ ఎంత?.. అందరి ఫోకస్ ఆయనపైనే

-

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు గెలిచిన వాళ్లు మెజార్టీ పై ఫోకస్ చేస్తున్నారు. గత ఎన్నికలలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందా రాదా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖులు పోటీ చేసిన పలు నియోజకవర్గాల ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

కొన్నిచోట్ల వార్‌ వన్‌సైడ్‌ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా, మరికొన్నిచోట్ల తీవ్రమైన పోటీ నెలకొందని అంటున్నారు. గత రెండు పర్యాయలుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో బంపర్‌ మెజారిటీతో గెలిచిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నారు. అయితే వారణాసిలో మోదీ విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అటు బీజేపీ శ్రేణులు సైతం మోదీకి ఎంత మెజారిటీ వస్తోందో అని లెక్కలేసుకుంటున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు కూడా ప్రధానికి అనుకూలంగా రావడం వల్ల మరింత జోష్‌ మీద ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున అజయ్‌ రాయ్‌ నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news