భారత పర్యటనకు రానున్న ఇజ్రాయిల్ ప్రధాని…

-

వరసగా ప్రపంచ దేశాల నేతలు భారత పర్యటనకు రాబోతున్నారు. ఇప్పటి జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్నారు. దాదాపు రూ. 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే ఐదేళ్లలో జపాన్, ఇండియాలో పెట్టుబడులు పెట్టనుంది. మరోవైపు టెక్నాలజీ, ఆర్థిక రంగాల్లో పలు ఒప్పందాలు చేసుకున్నారు. 

ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ దేశ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ కూడా భారత పర్యటనకు రానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు 2 ఏప్రిల్ 2022 శనివారం నాడు భారతదేశానికి తన మొదటి అధికారిక పర్యటనను జరుపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్, ఇజ్రాయిల్ తో పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్షణ రంగం, ఆయుధాల కొనుగోలు వంటి అంశాలపై పలు ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.

మరోవైపు సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఇద్దరు వర్చువల్ భేటీలో పాల్గొననున్నారు. వాణిజ్యం, ఖనిజాలు, వలసలు, విద్యా వంటి వాటిపై ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకోనున్నారు. జూన్ 4,2020న భారత్ – ఆస్ట్రేలియా మధ్య మొదటి వర్చువల్ భేటీ జరిగింది. తాాజాగా రేపు మరోసారి ఇద్దరు నేతలు భేటీ కానున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news