ఏపీ మహిళల కోసం జగన్ మరో సంచలన నిర్ణయం

మహిళల స్వయం సాధికారిత కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాల ద్వారా వారికి జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని… చేయూత కింద అర్హత సాధించిన లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్ల పాటు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల కింద నిర్ణయించిన వ్యవధి మేరకు ఆర్థిక సహాయం అందుతుందన్న సీఎం… ఈ డబ్బు వారి జీవనోపాధికి ఉపయోగపడేలా ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకుల సహాయంతో స్వయం ఉపాధి మార్గాలను అమలు చేస్తోందని వెల్లడించారు.


దీన్ని మరింత విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం…లబ్ధిదారులకు పథకాన్ని అందుకునే మొదటి ఏడాది నుంచే వారిని స్వయం ఉపాధి మార్గాలవైపు మళ్లించే కార్యక్రమాలను మరింత పెంచాలని వివరించారు. 45-60 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల సాధికారతే లక్ష్యంగా చేయూత పథకం అని తెలిపారు. జిల్లాకు రెండు సూపర్‌ మార్కెట్‌ల ఏర్పాటు చేశారు. మొత్తం 27 చేయూత మహిళా మార్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కో సూపర్‌ మార్టులో కనీసం నెలకు రూ.30 లక్షలు టర్నోవర్‌ లక్ష్యంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు డోర్ డెలివరీ, ఆన్‌లైన్ బుకింగ్‌, వాట్సప్ బుకింగ్ సౌకర్యాలు అందుబాటులోకి ట్రెండ్స్, అజియో వంటి కంపెనీలతో ఒప్పందం అన్నారు సీఎం జగన్.