‘జమ్ముకశ్మీర్​లో ఏ క్షణమైనా ఎన్నికలు’.. సుప్రీంతో కేంద్ర సర్కార్

-

జమ్ము కశ్మీర్​ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్ము కశ్మీర్​లో ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఎన్డీఏ సర్కార్.. సుప్రీం కోర్టుకు తెలిపింది. ఎన్నికల నిర్వహణ అంశం పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘంపైనే ఆధారపడి ఉందని వెల్లడించింది. ఈ మేరకు సొలిసిటర్​ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తెలియజేశారు.

జమ్ము కశ్మీర్​లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు వివరించారు. తొలుత పంచాయతీ స్థాయిలో ఎన్నికలు.. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు .. వాటి అనంతరం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు అధికరణ 370 రద్దుపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. జమ్ముకశ్మీర్‌, లద్ధాఖ్​కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని.. దీనిపై పూర్తి వివరాలతో గురువారం (2023 ఆగస్టు 31) వివరణాత్మక ప్రకటన చేస్తామని అత్యున్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం నివేదించింది.

Read more RELATED
Recommended to you

Latest news