దిల్లీలో స్ట్రీట్‌ఫుడ్‌ తిన్న జపాన్‌ అంబాసిడర్.. నెటిజన్ల రియాక్షన్ చూశారా..?

-

భారత్‌లోని జపాన్‌ రాయబారి హిరోషి సుజుకి దంపతులు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇటీవలే హిరోషి జైలర్ సినిమాలోని నువ్వు కావాలయ్యా పాటకు స్టెప్పులేసి ఇండియన్ సోషల్ మీడియా యూజర్లకు దగ్గరయ్యారు. ఇక అప్పడి నుంచి ఆయనకు ఇండియాలో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.

అయితే సుజుకి జంట తమ సోషల్ మీడియాలో ఎక్కువగా దేశీయ రుచులను ఆస్వాదిస్తున్న వీడియోలను షేర్‌ చేస్తుంటారు. అప్పుడప్పుడు భారతీయ వంటకాలపై తమ అభిప్రాయాన్ని షేర్ చేస్తుంటారు. తాజాగా ఈ దంపతులు ఓ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే..?

తాజాగా ఆ దంపతులు స్ట్రీట్‌ఫుడ్‌ కోసం వెతుకుతూ ఉన్న క్రమంలో దిల్లీలో ఓ వంటకాన్ని రుచి చూశారు. ప్రముఖ యూట్యూబర్‌ మాయో సాన్‌తో కలిసి సరోజినీ నగర్‌ను సందర్శించారు. దీనిలో భాగంగా వారు రోడ్‌సైడ్‌ ఫుడ్‌ను ఎంజాయ్‌ చేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఆయన ఆలూ టిక్కీని తిన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉందని రాసుకొచ్చారు. ఈ వీడియో చూసి సుజుకీ దంపతుల సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news