కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు ముద్రించాలంటూ కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు ఢిల్లీ సీఎం, ఆప్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్. హర్యానా, గుజరాత్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే.. ఢిల్లీ సీఎం, ఆప్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్…ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హిందూ ఎజెండాను లేవనేత్తారు కేజ్రీవాల్.
అంతేకాదు.. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు ముద్రించాలని కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ముద్రించే నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు ముద్రించాలని డిమాండ్ చేశారు. ఇండోనేషియా లాంటి దేశాల్లో గణేషుడి బొమ్మలున్నాయి.. మన దేశంలో కూడా పెట్టి.. బీజేపీ తన హిందూత్వాన్ని నిరూపించుకోవాలని చురకలు అంటించారు.
Put images of deities Lakshmi-Ganesha on currency notes: Kejriwal's appeal to PM for 'getting economy on track'
Read @ANI Story | https://t.co/m4d4yxlfdT#ArvindKejriwal #Currency #indianeconomy #Rupee #rupeefalls #lakshmi #Ganesha pic.twitter.com/irlnGIwJvW
— ANI Digital (@ani_digital) October 26, 2022