ప్రజా సంక్షేమం కోసం ఎప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకునే కేరళ ప్రభుత్వం.. తాజా గా మరో కీలక నిర్ణయాన్ని తీసుకునేందుకు సిద్ధం అవుతుంది. దేశంలో మొదటి సారి విడాకుల నమోదు చట్టాన్ని తీసుకురావాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో మహిళలు, పిల్లలు, ట్రాన్స్ జెండర్లు తో పాటు వికాలాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయని ఆ రాష్ట్ర మంత్రి ఎంవీ గోవిందన్ అన్నారు. అవి పకడ్బందీగా అమలు చేయడానికి విడాకుల నమోదు చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
కాగ దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా విడాకుల నమోదు చట్టం లేదని ఆయన అన్నారు. కాగ వివాహం, విడాకులు అనేవి రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉన్నాయని అన్నారు. అందు చేత రాష్ట్రానికి దీనిపై చట్టాలు చేసే అధికారం ఉంటుందని తెలిపారు. కాగ విడాకుల నమోదు చట్టం వస్తే.. విడాకుల నమోదు సమయంలో దంపతలుకు పిల్లలు ఉన్నట్టయితే.. వారి సంరక్షణ గురించి కూడా వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే దంపతులు మళ్లీ పెళ్లి చేసుకుంటే కూడా పిల్లల భవిష్యత్తు కు భద్రత కల్పించేలా చట్టం కూడా తీసుకువస్తున్నట్టు తెలిపారు.