అక్కడ బయటకు వెళితే గొడుగు తీసుకెళ్లాల్సిందే..!

-

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే భౌతిక దూరం పాటించడమే ప్రధానమని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. భారత్‌లో చాలా వరకు పట్టణాల్లో కంటే గ్రామాల్లో కరోనా నియంత్రణకు ఎక్కువగా కృషి జరగుతుంది. లాక్ డౌన్ నిబంధనలను చాలా గ్రామాలు తూచ తప్పకుండా పాటిస్తున్నాయి. రేషన్ దుకాణల వద్ద, బ్యాంకుల వద్ద.. భౌతిక దూరం నిబంధనను పాటించడంతోపాటుగా వేరే గ్రామాలకు చెందిన వారు తమ ఊర్లలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

కొన్ని గ్రామాలు ప్రజలు భౌతిక దూరం పాటించేలా చేయడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేరళ అలప్పుజలోని తన్నేరుక్కోమ్ గ్రామ పంచాయతీ సరికొత్త ఆలోచించింది. భౌతిక దూరం నిబంధనను తప్పనిసరి చేయడమే కాకుండా.. గ్రామస్తులు దానిని పాటించేలా వారు బయటకు వచ్చినప్పుడు గొడుగులు వెంట తీసుకుని రావాలని సూచించింది. ఈ మేరకు గ్రామస్తులకు దాదాపు 10 వేల గొడుగులను.. సబ్సిడీపై అందజేసినట్టు సమాచారం.

ఇందుకు సంబంధించి కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ కూడా ట్విటర్ ఓ పోస్ట్ చేశారు. “ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించేందుకు న్నేరుక్కోమ్ గ్రామ పంచాయతీ గ్రామస్తులు బయటకు వెళ్లినప్పుడు గొడుగులు పట్టుకోవడం తప్పనిసరి చేసింది. ఇద్దరు వ్యక్తులు ఒకరికి ఒకరు తాకకుండా గొడుగును పట్టకున్నప్పుడు వారి మధ్య కనీసం ఒక మీటర్ దూరం ఏర్పడుతుంది. వారికి సబ్సిడీ ధరలకు గొడుగులు అందజేశారు”అని పేర్కొన్నారు. కాగా, కేరళలో ఇప్పటివరకు 481 కరోనా కేసులు నమోదు కాగా, 358 మంది ఆస్పత్రి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఏడుగురు మృతిచెందారు.

 

Read more RELATED
Recommended to you

Latest news