కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలు తలకిందుల అవుతున్నాయి. ఒక్క వైరస్ సామ్రాజ్యాలను కుదిపేస్తోంది. పేద దేశం, ధనిక దేశం, అభివృద్ధి చెందిన దేశం అని తేడా లేకుండా కరోనా వైరస్ పడగ విప్పిన పాములాగా చాలా మందిని బలి తీసుకుంటూ పోతుంది. చైనా దేశం వుహాన్ సిటీలో నవంబర్ నెలలో బయటపడిన ఈ వైరస్ ప్రస్తుతం 200 దేశాలకు పైగా విస్తరించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ నీ చాలా డేంజరస్ వైరస్ గా అభివర్ణించింది. ఇలాంటి సమయంలో కొంతమంది బుర్రలో గుజ్జు లేకుండా చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ మతపెద్ద కరోనా వైరస్ ప్రపంచంలో రావటానికి కారణం అమ్మాయిల పొట్టి డ్రెస్సులు అని మాట్లాడారు. అది కూడా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ మత పెద్ద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి.
ఈ వ్యాఖ్యలు ఎన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు కరోనా వైరస్ కి అమ్మాయిల డ్రెస్ కి ఏమైనా సంబంధం ఉందా భలే ముడి పెట్టి బాధ పడుతున్నారు అని విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల వెనక కొంత మంది సోషల్ మీడియాలో అమ్మాయిలు ఇదేమి దరిద్రం సామీ వాడెవడో గబ్బిలం తినటం వల్ల ఈ వైరస్ వచ్చిందంటుంది అని ప్రపంచం అంటుంటే మా బట్టలకు ముడిపెడతారు ఏంటి అని అంటున్నారు. వెంటనే ఆ మత పెద్ద క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.