Meftal pain killer : ‘మెఫ్తాల్’ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పంటి నొప్పి, జ్వరం, రక్తస్రావం, మహిళలకు పీరియడ్స్ టైం లో వచ్చే నొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లకు వినియోగించే పెయిన్ కిల్లర్ ‘మెఫ్తాల్’ పై కేంద్రం డ్రగ్ సేఫ్టీ అలర్ట్ జారీ చేసింది. ఈ ఔషధం ప్రతికూల ప్రభావాలను పర్యవేక్షించాలని ఆరోగ్య రంగ నిపుణులకు ఇండియన్ ఫార్మాకోపోయియా కమిషన్ సూచించింది.
దుష్ప్రభావాల గురించి www.ipc.gov.in లేదా 18001803024 నంబర్ కు కాల్ చేసి వెల్లడించాలని కోరింది. అయితే..ఈ పెయిన్ కిల్లర్ ‘మెఫ్తాల్’ వివిధ అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. వివిధ ఔషధాలపై ప్రతికూల పరిస్థితులపై పర్యవేక్షణతో పాటు సమాచారం సేకరించే సంస్థ ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా. కనుక ఈ ఔషధం వినియోగం, సిఫారసు విషయంలో జాగ్రత్తగా పరిశీలించాలని వైద్యులకు సూచించింది.