కంటే కూతుర్నే కనాలి అని ఎందుకు అంటారో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్యను చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం లాలూ తీవ్ర అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. దీని కోసం డోనర్లని వెతికారు. అయితే లాలూకి ఆయన రెండో కుమార్తె రోహిణీ ఆచార్య కిడ్నీ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో ఆమె తన తండ్రికి కిడ్నీ ఇవ్వడానికి రెడీ అయ్యారు.
రోహిణీ సింగపూర్‌లో నివసిస్తున్నారు. లాలూ అక్టోబర్‌లో సింగపూర్ వెళ్లి వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నారు. వారు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలని ఆయనకు సూచించారు. దీంతో తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు రోహిణి ముందుకొచ్చారు. తన ప్రాణం కాపాడుకొనేందుకు కుమార్తె కిడ్నీని స్వీకరించేందుకు లాలూ నిరాకరించినట్లు సమాచారం. కానీ, కుమార్తె ఒత్తిడి చేయడంతో పాటు, కుటుంబ సభ్యుల కిడ్నీని అమరిస్తే శస్త్రచికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆయన అంగీకరించాల్సి వచ్చింది. ఆపరేషన్ కోసం లాలూ నవంబర్ 20-24 మధ్య సింగపూర్‌కు వెళ్లే అవకాశం ఉంది.