మా ఆస్పత్రిలో రెండు గంటలకే ఆక్సీజన్ ఉంది, ప్రమాదంలో 60 మంది ప్రాణాలు…!

-

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కేసుల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు పెద్దగా ఫలితం కూడా ఇవ్వడం లేదు. ఆక్సీజన్ కొరత దెబ్బకు ఢిల్లీ, యుపి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు చుక్కలు చూస్తున్నాయి. ఢిల్లీలోని పలు ఆస్పత్రులకు నో ఆక్సీజన్ బోర్డ్ లు కూడా పెట్టారు. ఇక నిన్న ఒక్క రోజే 3 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.

ఇదిలా ఉంటే… ఢిల్లీలోని ప్రముఖ ఆస్పత్రి సంచలన ప్రకటన చేసింది. ఢిల్లీలోని పలు ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపధ్యంలో గడిచిన 24 గంటల్లో గంగా రామ్ హాస్పటల్ లో 25 మంది మృతి చెందారు. కేవలం ఆక్సిజన్ మరో రెండుగంటలు పని చేస్తుంది అని ఆ ఆస్పత్రి డైరెక్టర్ ప్రకటించారు. ప్రమాదంలో ఉన్న మరో 60 మంది కోవిడ్ రోగుల జీవితాలు ఉన్నాయని గంగా రామ్ హాస్పిటల్ డైరెక్టర్ ప్రకటన చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news