List of Central Government Schemes 2023: ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సూపర్ బెనిఫిట్స్..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీముల వలన చాలా రకాల ప్రయోజనాలని పొందుతున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సూపర్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఇక మరి ఆ స్కీముల వివరాలని ఇప్పుడు చూసేద్దాం.

 

సుకన్య సమృద్ధి యోజన:

సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ వలన చాలా మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఆడపిల్లల శ్రేయస్సు కోసం దీన్ని తీసుకు వచ్చారు. తల్లిదండ్రులు తమ ఆడ పిల్లల భవిష్యత్తు కోసం దీన్ని తీసుకు రావడం జరిగింది. ఆడ పిల్లల భవిష్యత్తు, విద్య, వివాహ ఖర్చుల కోసం సుకన్య సమృద్ధి యోజన ని ప్రవేశ పెట్టారు. ఈ స్కీమ్ కింద 7.6% వడ్డీ రేటు అందిస్తోంది. ఈ స్కీమ్ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా అందిస్తుంది. ఇండియా పోస్ట్ ఆఫీస్ లేదా అధీకృత వాణిజ్య బ్యాంకుల శాఖ లో ఈ అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు.

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన:

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. 18 మరియు 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. నరేంద్ర మోడీ మే 9న కోల్‌కతాలో లాంఛనంగా ప్రారంభించారు.
దీని వార్షిక ప్రీమియం ₹330.

ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన:

ఇక ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం గురించి చూస్తే.. 2015లో ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ 2015 బడ్జెట్ ప్రసంగంలో దీని కోసం చెప్పారు. 2015 మే 8న కోల్‌కతాలో ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. 18 మరియు 70 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లకి ఈ స్కీమ్ బెనిఫిట్ కలుగుతుంది.

అమృత్:

పేదలు మరియు వెనుకబడిన వాళ్ళ కోసం దీన్ని తీసుకు వచ్చారు. నీటి సరఫరా, మురుగునీటి పారుదల, పట్టణ రవాణా, పార్కులు వంటి ప్రాథమిక పౌర సౌకర్యాలను అందించేందుకే ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news