ఇవాళ నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్

-

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. నాల్గోవిడతలో10 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల పరిధిలోని 96 లోక్‌సభ స్థానాల్లో సోమవారం ఓటింగ్‌ జరగనుంది.ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, ఉత్తర ప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్‌లో 8 చొప్పున, బిహార్‌లో 5, ఒడిశా, ఝార్ఖండ్‌లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో  పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగువిడతల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నెల 13న జరిగే తొలివిడతలో ఒడిశాలో 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

మహారాష్ట్రలో సోమవారం పోలింగ్‌ జరిగే 11 స్థానాల బరిలో మొత్తం 298 మంది అభ్యర్థులు ఉన్నారు.  కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే జల్నా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్సీపీ-ఎస్పీకి చెందిన నటుడు అమోల్ కోల్హే…. శిరూర్ నుంచి పోటీలో ఉన్నారు. మహారాష్ట్రలో ఈ దఫా ఎన్నికల్లో 2.28 కోట్ల కంటే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 23,284 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. దేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌ తర్వాత అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ మొత్తం 48 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇప్పటికే తొలి మూడు విడతల్లో 24 స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news