కరోనా కష్ట కాలం సమయంలో మన ప్రాణాలను కాపాడేది ఒక్క మాస్క్ మాత్రమే అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా కూడా మాస్క్ అవసరం అనేది చాలా పెరిగింది. దాదాపుగా అన్ని దేశాల్లో మాస్క్ అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరు ధరిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో మాస్క్ లేదని భారీగా వసూలు చేసారు.
ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 29 మధ్య ఫేస్ మాస్క్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 1,60,279 మంది నుంచి… ముంబైలో బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) సుమారు రూ .3.5 కోట్ల జరిమానా వసూలు చేసింది. మాస్క్ విషయంలో అధికారులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా సరే ప్రజలు మారడం లేదు.