మ‌రుగుతున్న నూనెలో చేయి పెట్ట‌మ‌ని భార్య‌కు ప‌రీక్ష పెట్టిన భ‌ర్త‌.. వీడియో..!

Join Our Community
follow manalokam on social media

మ‌హారాష్ట్ర‌లోని ఒస్మానాబాద్ అనే ప్రాంతంలో షాకింగ్ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ భ‌ర్త త‌న భార్య‌కు అగ్ని ప‌రీక్ష లాంటి ప‌రీక్ష పెట్టాడు. త‌న భార్య స్వ‌చ్ఛంగా ఉందా, లేదా అని తెలుసుకునేందుకు అత‌ను మ‌రుగుతున్న నూనె ప‌రీక్ష పెట్టాడు. అందులో చేయి పెట్టి ఆ నూనెలో ఉండే నాణేన్ని తీయాల్సి ఉంటుంది. ఈ సంఘ‌ట‌న‌కు అంద‌రూ షాక్‌కు గుర‌వుతున్నారు.

man puts his wifes hand in boiling oil for purity test video

ఒస్మానాబాద్ కు చెందిన ఓ మ‌హిళకు, ఆమె భ‌ర్త‌కు గొడ‌వ అయింది. దీంతో ఆమె అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌లేదు. అయితే 4 రోజుల త‌రువాత ఆమె ఇంటికి తిరిగి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో ఆమె భ‌ర్త ఆమె కోసం అన్ని చోట్లా గాలించాడు. అయితే ఇంటి తిరిగి వ‌చ్చిన ఆమెను అత‌ను నిల‌దీశాడు. ఇన్ని రోజులు ఎక్క‌డ ఉన్నావు ? అని అడ‌గ్గా.. ఆమె బ‌దులిస్తూ.. తాను ఒక చోట బ‌స్ కోసం ఎదురు చూస్తుండ‌గా.. న‌లుగురు వ్య‌క్తులు త‌న‌ను అప‌హరించుకుపోయి 4 రోజులు బంధించి ఉంచార‌ని, త‌రువాత వారు త‌న‌ను వ‌దిలేశార‌ని, త‌న‌ను వారు ఏమీ చేయ‌లేద‌ని ఆమె తెలిపింది.

అయితే.. అనుమానించిన ఆమె భ‌ర్త ఆమెకు ప‌రీక్ష పెట్టాడు. మ‌రుగుతున్న నూనెలో రూ.5 నాణేన్ని వేసి దాన్ని చేత్తో తీయ‌మ‌న్నాడు. ఆమె ఎలాంటి త‌ప్పు చేయ‌క‌పోతే చేయి కాల‌ద‌ని మూర్ఖంగా వాదిస్తూ ఆ నాణేన్ని నూనెలో వేశాడు. అదే స‌మ‌యంలో వీడియో కూడా తీశారు. దాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. వైర‌ల్‌గా మారింది. అయితే ఆ వీడియోలో చూపించిన‌ట్లుగా నిజంగానే ఆమె ఆ నూనె నుంచి నాణేన్ని తీసిందా, లేదా.. అనే వివ‌రాలు మాత్రం తెలియ‌వు. కానీ దీనిపై అంద‌రూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అక్క‌డి స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా ఈ హేయ‌మైన సంఘ‌ట‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఇలాంటివి అక్క‌డ మామూలేన‌ని తెలిసింది. అక్క‌డ త‌ప్పు చేసిన వారికి కూడా ఇలాంటి శిక్ష‌లే వేస్తార‌ని స‌మాచారం. మరుగుతున్న నూనె నుంచి నాణేన్ని తీయ‌మ‌ని చెబుతారు. వారికి చేయ కాలిపోకుండా ఉంటే వారు ఏ త‌ప్పు చేయ‌లేద‌ని భావిస్తారు. కానీ త‌ప్పు చేసినా, చేయ‌క‌పోయినా.. మ‌రుగుతున్న నూనెలో చేయి పెడితే ఎలాగైనా కాలుతుంది. ఈ విష‌యం కూడా తెలియ‌ని మూర్ఖులు ఇంకా స‌మాజంలో ఉండ‌డం సిగ్గు చేట‌ని చెప్ప‌వ‌చ్చు.

TOP STORIES

జీవితంలో గెలవడానికి అలవర్చుకోవాల్సిన ఐదు అలవాట్లు..

కొన్ని అలవాట్లు మన జీవితాలని మార్చేస్తాయి. అలాగే మరికొన్ని అలవాట్లు మనల్ని విజయ తీరాలకి దూరంగా పడవేస్తాయి. ఇంకొన్ని అలవాట్లు విజయ సంద్రంలో నిత్యం తడిచేలా...