మళ్లీ వచ్చి ఓటేసిన మిజోరం సీఎం.. పోలింగ్‌ శాతం ఎంతంటే..?

-

ఈశాన్య రాష్ట్రం మిజోరంలో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. మిజోరం సీఎం జోరంథంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. ఈవీఎం సమస్య కారణంగా ఆయన తొలిసారి ఎన్నికల కేంద్రానికి వచ్చి ఓటు వేయలేక వెనక్కి వెళ్లారు. టిఫిన్ చేసి వస్తానని అక్కడున్న మీడియాతో చెప్పి వెనుదిరిగారు. అనంతరం అల్పాహారం చేసిన తర్వాత 11 గంటల సమయంలో మరోసారి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మిజోరంలో మొత్తం 40 స్థానాలకు ఓటింగ్‌ జరుగుతుండగా.. అధికారులు పోలింగ్​కు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల సమయానికి 32.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నట్లు చెప్పారు. మొత్తం 12 వందల 76 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బంగ్లాదేశ్, మయన్మార్‌తో మిజోరం పంచుకుంటున్న సరిహద్దుల వెంబడి.. పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మణిపుర్‌, అసోం, త్రిపుర రాష్ట్రాల.. సరిహద్దులను మూసివేశారు. ఈ ఎన్నికల్లో 174 మంది అభ్యర్థుల తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news