మణిపుర్​లో నగ్నంగా ఇద్దరు మహిళల ఊరేగింపు.. నిందితులను విడిచిపెట్టనన్న మోదీ

-

మణిపుర్​లో జాతుల మధ్య ఘర్షణలు రోజురోజుకు తీవ్రంగా మారుతున్నాయి. ఈ అల్లర్లో తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. కొందరు పురుషులు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు కేంద్ర సర్కార్​పై భగ్గమంటున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పందించారు. ఇద్దరు మహిళలపై అమానవీయ ఘటన కలచివేసిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసిందని అన్నారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. నిందితులను విడిచిపెట్టబోమని భారత ప్రజలకు భరోసా ఇస్తున్నానని పార్లమెంట్ భవనం ముందు మీడియాతో మాట్లాడుతూ మోదీ మాటిచ్చారు. మణిపుర్‌ ఘటనపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలని ప్రధాని కోరారు. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ ఘటనపై పార్లమెంటులో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో చర్చ జరగాలని పట్టుబడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news