సీఎం సీటు…ఇప్పుడు ఇదే ఏపీలో చంద్రబాబు, పవన్‌లని ముంచనుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ఎంత బలంగా ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. ఆ బలమైన నేతని గద్దె దించాలంటే చంద్రబాబు బలం సరిపోవడం లేదు. అటు పవన్ బలం ఏ మాత్రం దరిదాపుల్లో ఉండదు. కానీ బాబు-పవన్ కలిస్తే మాత్రం..జగన్‌కు రిస్క్ అని చెప్పవచ్చు. అందుకే వారు పొత్తు దిశగా వెళుతున్నారు.
కాకపోతే పొత్తులో అనేక రిస్క్‌లు ఉన్నాయి. మొదట టిడిపి-జనసేనలతో బిజేపి కలిసిదంటే..ఏపీలో బిజేపికి ఉన్న యాంటీ..ఆ రెండు పార్టీలపై పడుతుంది. అప్పుడు బాబు-పవన్ కే డ్యామేజ్. ఈ విషయం పక్కన పెడితే..పొత్తుల విషయంలో టిడిపికి ఎక్కువ నష్టం ఉంటుంది..ఎందుకంటే అన్నీ స్థానాల్లో టిడిపికి బలం ఉంది..కానీ జనసేన-బిజేపిల కోసం కొన్ని సీట్లు వదులుకోవాలి. దీని వల్ల టిడిపి శ్రేణులు అసంతృప్తిగా ఉంటాయి. అదే సమయంలో జనసేన-బిజేపిలకు టిడిపి ఓట్లు బదిలీ అవ్వడం అనేది కష్టమైపోతుంది. అంటే ఇదొక రిస్క్.
ఇక అన్నిటికంటే పెద్ద రిస్క్. సిఎం సీటు..వాస్తవానికి దీనిపై ఎక్కువ చర్చ ఉండకూడదు..చంద్రబాబు ఉండగా సిఎం సీటుపై చర్చ వేస్ట్. కానీ జనసేన శ్రేణులు పవన్‌ని సిఎంగా చూడాలని అనుకుంటున్నారు. ఆ మధ్య సిఎం సీటు అక్కర్లేదనీ పవన్ అనడంతో జనసేన శ్రేణులు అసంతృప్తికి గురయ్యారు. పొత్తు ఉన్నా తాము టిడిపికి ఓట్లు వేయమని అన్నారు.
దీంతో పవన్ సిఎం పదవి ఇస్తే తీసుకుంటానని చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచాక అప్పుడు బలాబలాలని బట్టి సిఎం సీటు తేల్చుకుంటామని అంటున్నారు. అందుకు టిడిపి ఒప్పుకోదు. ముందే టిడిపికి సిఎం సీటు అంటే జనసేన ఒప్పుకోదు. ఇక సిఎం ఎవరనేది తెలియకుండా ఎన్నికలకు వెళితే ఆటోమేటిక్ గా బాబు-పవన్‌కే నష్టం. మొత్తానికి సిఎం సీటు అనేది బాబు-పవన్‌లని ముంచేలా ఉంది.