గతేడాది చివరి నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మరణించిన విషయం తెలిసిందే. మోదీ తల్లి మరణ వార్త విని చాలా మంది విచారం వ్యక్తం చేశారు. ప్రధానికి సానుభూతి ప్రకటించారు. అయితే మోదీ తల్లి మరణానికి సంబంధించిన వార్తలు చూసి మల్లేశ్వరంలోని ఎంఈఎస్ కిశోర కేంద్ర పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఆరుశ్ శ్రీవత్స కూడా బాధ పడ్డాడు.
ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి రాసిన లేఖలో ప్రస్తావించాడు. ‘ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. మీకు నా హృదయ పూర్వక సానుభూతి’ అంటూ ఆరుశ్ గత డిసెంబరు 30న రాసిన లేఖకు ప్రధాని బదులిచ్చారు. జనవరి 25న ప్రధాని రాసిన లేఖ ఆ బాలునికి ఫిబ్రవరి మొదటివారంలో అందింది. ప్రధాని నుంచి బదులు రావడంతో ఆరుశ్‌తో పాటు, అతని కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.