పశువులకు కృత్రిమ గర్భధారణ కార్యక్రమం మొదలుపెట్టనున్న మోడీ

-

బీహార్ ఎన్నికల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రచారం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి అని భావిస్తుంది. ఈ నేపధ్యంలోనే ఒక కీలక కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శ్రీకారం చుట్టే ఆలోచనలో ఉన్నారు. బీహార్ లో 80 శాతం వ్యవసాయ ఆధారిత జీవనం గడుపుతారు. ఈ నేపధ్యంలోనే అక్కడి పశువుల కోసం ప్రధాని ఒక కార్యక్రమం మొదలు పెట్టే ఆలోచన చేసారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌ లో బీహార్ ఎన్నికలు జరుగుతాయి.

జాతీయ గోకుల్ మిషన్ ప్రోగ్రాం కింద బరౌని డెయిరీ పరిధిలో… షార్ట్ సెక్స్ సీమన్ అనే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పశువుల కోసం కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం దేశ రాజధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సాంకేతికత బీహార్ పాడి పరిశ్రమలో కొత్త విప్లవాన్ని తీసుకొస్తుందని కేంద్రం అంటుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల 2020 షెడ్యూల్ ప్రకటనకు ముందు ఇది ఒక ప్రధాన రాజకీయ పరిమమంగా నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news