ఎమిరేట్స్‌తో భారత్ ‘రూపాయి’ బంధం.. స్థానిక కరెన్సీల్లో వాణిజ్య చెల్లింపులకు ఒప్పందం

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యూఏఈ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో .. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. గత ఏడాది CEPA వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించాయి.

స్థానిక కరెన్సీల్లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇరు దేశాలు ఒప్పందానికి వచ్చాయని ప్రధాని మోదీ చెప్పారు. స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం.. ద్వైపాక్షిక పెట్టుబడులను మరింత పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్.. దృష్టి, స్పష్టమైన ఆలోచన.. భారత్​- యుఏఈ ద్వైపాక్షిక సంబంధాలకు అతిపెద్ద ఆస్తులు అని మోదీ కొనియాడారు.

UAEలో జరిగే COP-28 సమ్మిట్‌కు  నేను హాజరుకావాలనే నిర్ణయానికి వచ్చాను. అబుదాబిలో ఉన్నందుకు, మిమ్మల్ని (యూఏఈ అధ్యక్షుడు) కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. సాదర స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు. ప్రతి భారతీయుడు మిమ్మల్ని నిజమైన స్నేహితునిగా చూస్తారు”

– నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి

Read more RELATED
Recommended to you

Latest news