ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్.. షిండే వర్గంలోకి ఎంపీ గజానన్‌

-

మహారాష్ట్ర రాజకీయాల్లో వేగంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా శివసేనలోని రెండు వర్గాల్లో జంపింగ్ లు సాధారణమైపోయాయి. షిండే వర్గం నుంచి ఠాక్రే వర్గానికి, ఠాక్రే వర్గం నుంచి షిండే వద్దకు నేతలు జంపింగ్ గేమ్ ఆడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు మరో షాక్ తగిలింది. ఆయన వర్గంలోని మరో ఎంపీ తన వర్గం నుంచి జంప్ అయ్యారు. ఉద్ధవ్‌ నేతృత్వలోని శివసేన జాతీయ కార్యవర్గ సభ్యుడైన ఎంపీ గజానన్‌ కీర్తికర్.. సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరారు. దీంతో షిండే వర్గంలో చేరిన ఎంపీల సంఖ్య 13కు చేరింది. ఈ నేపథ్యంలో ఆయణ్ను తమ ఠాక్రే శివసేన నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ వర్గం ప్రకటించింది.

ముంబయిలో మొత్తం ఆరు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన మూడు చొప్పున స్థానాలు గెలుపొందాయి. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో శివసేనకు చెందిన ఇద్దరు ఎంపీలు ఇప్పటికే షిండే వర్గంలో చేరిపోయారు. ఇక ఉద్ధవ్‌ వర్గంలో ఎంపీ అరవింద్ సావంత్ ఒక్కరే మిగిలిపోయారు.  శివసేనకు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది షిండే వర్గంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news