MRSAM క్షిపణి ప్రయోగం విజయవంతం…. అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ హిట్

-

భారత రక్షణ దళాలకు కీలక విజయం దక్కింది. ఎమ్ఆర్సామ్ ( MRSAM) క్షిపణి ప్రయోగం విజయవంతం అయింది. ఒడిశా బాలాసోర్ తీరంలోని చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి ఈ పరీక్ష జరిగింది. తాజాగా భారత రక్షణ శాఖ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (ఎంఆర్‌ఎస్‌ఏఎం) అధునాతన వెర్షన్‌ను ప్రయోగించింది. సుదూరంగా ఉన్న వైమానికి లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా క్షిపణి ఛేదించింది. ఈ ప్రయోగంతో భారత రక్షణ రంగం మరింత బలోపేతం అవుతుంది. 

DRDO, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన MRSAM ను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ దేశీయంగా తయారు చేసింది. ఈ క్షిపణి వల్ల రక్షణ దళాల పోరాట సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. తాజాగా జరిగిన ఈ ప్రయోగానికి ముందు ప్రయోగ స్థలానికి దగ్గర ఉన్న సుమారు 7000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 100కిలోమీటర్ల పరిధిలోని ఉండే ఎటువంటి లక్ష్యానైనా అత్యంత ఖచ్చితంగా, వేగంగా హిట్ చేస్తుంది. 2.7 టన్నుల బరువు ఉండే MRSAM క్షిపణి 60 కిలోల పేలోడ్ ను తీసుకెళ్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news