ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు చూడలేదు.. కన్నీటి పర్యంతమైన డాక్టర్‌.. వీడియో..!

కరోనా కొత్త స్ట్రెయిన్లు ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కొత్త కోవిడ్‌ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గతంలో యువతకు కరోనా ఎక్కువగా సోకలేదు. కానీ ఇప్పుడు వారు, చిన్నారులు కూడా కరోనా బారిన పడుతున్నారు. మరోవైపు రోజు రోజుకీ విలయతాండవం చేస్తున్న కరోనాతో దేశప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులైన ఓ డాక్టర్‌ కన్నీటి పర్యంతమైంది. తమకు ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆమె వాపోయింది.

mumbai doctor heart broken over current covid situation

ముంబైకి చెందిన ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ తృప్తి గిలద ప్రస్తుతం దేశంలో నెలకొన్న కోవిడ్‌ పరిస్థితిపై మాట్లాడింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. అందులో ఆమె కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలను చూడవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. మేం నిస్సహాయ స్థితిలో ఉన్నాం. డాక్టర్లు అందరూ ఆందోళన చెందుతున్నారు. నాకు ఏం చేయాలో తెలియడం లేదు. ప్రస్తుత పరిస్థితిని తలుచుకుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి. మేం రోజూ చాలా మంది కోవిడ్‌ పేషెంట్లకు చికిత్స అందించాల్సి వస్తోంది. కోవిడ్‌ పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. దయచేసి ఇంట్లోనే ఉండండి. బయటకు వెళ్తే మాస్కులను ధరించండి… ఆ డాక్టర్‌ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.