యువశక్తిని ఏకం చేసేందుకే మై భారత్ : ప్రధాని మోడీ

-

సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా యువత కోసం అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా మేరా యువ భారత్ వేదికను ప్రారంభించనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించేందుకు ఇది అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఆదివారం ప్రధాని మోదీ మన్ కీ బాత్ 106వ ఎపిసోడ్ లో మాట్లాడారు. గత నెలలో ఢిల్లీలో ఖాదీ దుస్తుల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయని, ఈనెల పండుగ సీజన్ లో కూడా దేశవ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో ఖాదీ దుస్తులు, స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేశారని ప్రధాని మోడీ అన్నారు.


రాబోయే పండుగలకు కూడా ఇదే స్పూర్తితో స్థానికంగా తయారైన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని దేశ ప్రజలను కోరారు. లోకల్ ఫర్ వోకల్ నినాదానికి ఇది ఎంతో బలాన్ని ఇస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు. దేశంలోని యువతలో తమ పేర్లను తప్పక రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. అక్టోబర్ 31న దేశంలో అతిపెద్ద సంస్థను ప్రారంభించబోతున్నాం. దాని పేరే మై యంగ్ ఇండియా. దేశాభివృద్ధి కోసం నిర్వహించే కార్యక్రమాల్లో యువత కీలకపాత్ర పోషించేందుకు మై భారత్ అవకాశాలను కల్పిస్తుంది. అభివృద్ధి చెందిన భారత్ ను నిర్మించేందుకు దేశంలోని యువశక్తిని ఏకీకృతం చేయడానికి ఇదో వినూత్న ప్రయత్నం అని ప్రధాని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news