వర్క్ ఫ్రం హోంపై కీలక వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిన్ నారాయణ మూర్తి

-

కరోనా ప్రారంభం అయి రెండేళ్లు గడిచిపోతోంది. ఇప్పటికీ చాలా మంది ఐటీ, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ లో మళ్లీ ఆఫీసులు మొదలవుతాయనే సందర్భంలో ఓమిక్రాన్ వల్ల మళ్లీ వర్క్ ఫ్రం హోం కే పరిమితం అవుతున్నారు. దీంతో ఉద్యోగులు కూడా వర్క ఫ్రం హోమ్ కు చాలా అలవాటుపడ్డారు. ఇంటి నుంచి పని చేయడం వల్ల ఉద్యోగుల పనితనంపై ప్రభావం పడుతుందనే వాదనలు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే… వర్క్ ఫ్రం హోంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇన్ఫోసిన్ నారాయణ మూర్తి. ఉద్యోగులను ఆఫీసులకు వచ్చేలా ప్రోత్సహించాలని ఐటీ కంపెనీలకు సూచించారు. ఇంటి నుంచి పనిచేయడం తనకు ఇష్టం లేదని.. వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల ఉద్యోగిలో సృజనశీలత సాధ్యం కాదని.. పనిలో నాణ్యత ఉండదన్నారు. వర్క్ ఫ్రం హోం వల్ల కంపెనీల సంస్థాగత వ్యవహారాలు, ఉత్పాదకత తగ్గిందని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news