IPL 2023 : నేహాల్ సిక్సర్ దెబ్బకు కారుకు సొట్ట…రూ. 5 లక్షల బహుమతి ప్రకటన

-

ముంబై, ఆర్సిబి మ్యాచ్ లో ముంబై బ్యాటర్ నెహాల్ వదెరా కొట్టిన సిక్సర్ స్టేడియంలో ఉన్న కారుకు తగిలింది. ప్లేయర్లకు బహుమతిగా ఇచ్చేందుకు నిలిపిన టాటా టియాగో కారు డోర్ హ్యాండిల్ కు బాలు తాకింది. దీంతో హ్యాండిల్ దగ్గర డెంట్ ఏర్పడింది.

ఇదే సీజన్లో గైక్వాడ్ కొట్టిన సిక్సర్ కూడా కారుకు తగిలింది. ఒక్కసారి కారుకు తగిలితే టాటా కంపెనీ రూ.5,00,000ను కర్ణాటకలో కాఫీ మొక్కల పెంపకానికి డొనేట్ చేస్తుంది. కాగా,నిన్న జరిగిన మ్యాచ్‌ లో బెంగళూరు ఘోర పరాజయం పాలైంది. ముంబై, బెంగళూరు జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సగం విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బెంగళూరు జట్టు నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో మూడు ఓవర్లు మిగిలి వుండగానే చేదించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news