మందిర నిర్మాణానికి మూడున్నరేళ్లు.. ఇదే కొత్త నమూన

-

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామమందిర నిర్మాణానికి ఏర్పట్లు మొదలయ్యాయి. రాములవారి గుడి నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు తమకు తోచినంత డబ్బు, ఇతర రూపాల్లో సాయం చేస్తున్నారు. మందిర నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. ఆ ఆలయం ఎలా ఉండబోతుందో మందిరానికి సంబంధించిన ట్రస్టు ప్రతికాత్మక నమూనాను సిద్ధం చేసింది. రామలల్లా ఆలయానికి వీహెచ్‌పీ రూపొందించిన మోడల్‌ పాతది . కొత్తదానిని చంద్రకాంత్‌ సొంపురా అనే వ్యక్తి తయారు చేశారు. దీనివల్ల ఆలయ రూపకల్పన పరిమాణం, వైశాల్యంలో చిన్నపాటిæ మార్పులు చోటుచేసుకున్నాయి. ఆలయ నిర్మాణానికి మట్టి పరీక్షలు చేసి నిర్మాణాలకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఎంత లోతుగా తవ్వితే ఆలయం పటిష్టంగా ఉంటుందో, ఎక్కడ గోపురాలు నిర్మించాలి, వేదికను ఎంత ఎత్తున నిర్మించాలనే ప్రాజెక్టు అధికారులు అంచనా వేశారు.

ఎలాంటి వాస్తుదోషాలు లేకుండా ఆలయనిర్మాణం చేపడుతున్నారు. నిర్మాణం పూర్తికావడానికి మరో మూడున్నర ఏళ్ల సమయం పడుతుందన్నారు. రామాలయం ఎత్తు 33 అడుగులు ఉండబోతుంది. 5 గోపురాలు ఉండనున్నాయి. గర్భగుడి ఎక్కడ ఉంటుందో అక్కడే ఆలయ ప్రధాన గోపురం నిర్మించనున్నారు. ఇందులో సింహ ద్వారం, నృత్య మండపం, రంగ మండపాలను నిర్మించనున్నారు. ఆలయ గోపురం ఎత్తు 161 అడుగులకు పెంచారు. అలాగే పునాదికి 20 నుంచి 25 అడుగుల లోతున తవ్వుతున్నారు. రామమందిర వేదిక ఎత్తు 14 అడుగుల వరకు ఉండాలని మందిర నిర్మాణ ట్రస్టు నిర్ణయించింది. మొత్తం 318 స్తంభాలను నిర్మించనున్నారు. కొన్ని రోజుల్లో సీతా సమేత రాముడు ఆలయంలో ఏవిధంగా దర్శనమ్వినున్నాడో? తన సోదరులతో కలిసి ఎలా రాజ్యపాలను చేస్తాడో కళ్లారా చూడనున్నాం. దానికి ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమి పూజచేసి మొదటి ఇటుక వేయటంతోనే వందల ఏళ్ల నిరీక్షనకు తెరపడింది. మరి ఆలయ ప్రారంభం దేశమంతా పండగ వాతావరణం నెలకొంటుందని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news