హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ 9మంది మృతి

-

ఉత్తరాఖండ్‌లోని ఎగువ హిమాలయ పర్వతాల్లో సహస్త్రతాల్‌ సరస్సు వద్దకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన బృందంలో 9 మంది దుర్మరణం చెందారు. మరికొందరు ట్రెక్కర్లు అక్కడే చిక్కుకుపోయారు. చిక్కుకుపోయిన వారిలో ఐదుగురిని ఉత్తరాఖండ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు కాపాడగా.. మిగిలిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అసలేం జరిగిందంటే?

హిమాలయాల్లో 4 వేల 400 మీటర్ల ఎత్తున సహస్త్రతాల్ సరస్సును అధిరోహించేందుకు మే 29న 22 మందితో కూడిన ట్రెక్కింగ్‌ బృందాన్ని హిమాలయన్‌ వ్యూ ట్రెక్కింగ్‌ ఏజెన్సీ సరస్సు వద్దకు పంపింది. జూన్‌ 7న తిరుగు ప్రయాణంలో ప్రతికూల వాతావరణం కారణంగా వారు దారి తప్పి బేస్‌ క్యాంప్‌నకు చేరుకోలేకపోయారు. అప్రమత్తమైన ట్రెక్కింగ్ ఏజెన్సీ వారి ఆచూకీ కోసం గాలించగా 9 మంది ట్రెక్కర్లు చనిపోయినట్లు గుర్తించింది. మిగిలిన వారు అక్కడే చిక్కుకుపోయినట్లు తేల్చింది. దీంతో వెంటనే ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇవ్వడంతో హెలికాఫ్టర్‌ సాయంతో SDRF వారిని కాపాడినట్లు ఉత్తరకాశి కలెక్టర్‌ తెలిపారు.మిగిలిన వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఏరియల్ రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టామని జిల్లా మేజిస్ట్రేట్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news