తెలంగాణ వేదికగా రేపటి నుంచి ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు

-

ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు (గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌-2024) జరగనుంది. అంతర్జాతీయ సరకుల (కమాడిటీస్‌) సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌కు భారత్‌లో ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణను దీనికి వేదికగా ఎంచుకున్నారు. ప్రపంచంలో బియ్యం వినియోగం ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో వరిసాగులో ఎరువుల వాడకం తగ్గింపు, వాతావరణ పరిస్థితులను అధిగమించేలా సాగు, సాంకేతిక వినియోగం వంటి అంశాలను సదస్సులో చర్చించనున్నారు.

అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థల కన్సార్షియం, భారతదేశ వరి పరిశోధన సంస్థ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని చంద్రశేఖర్‌ ఆజాద్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఒడిశా వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారతదేశ వరి ఎగుమతిదారుల సమాఖ్య, ఫిక్కి తదితర సంస్థల ప్రతినిధులతో పాటు దాదాపు 30 దేశాల నుంచి వరి ఎగుమతి, దిగుమతిదారులు, భారతీయ అనుబంధ సంస్థల ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్రం నుంచి అధికారులు, శాస్త్రవేత్తలు, ఆదర్శరైతులు ఇందులో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news