విజృంభిస్తున్న ‘నిఫా’.. మరో ఇద్దరికి సోకిన వైరస్.. అప్రమత్తమైన కేరళ సర్కార్

-

నిఫా వైరస్ మరోసారి భారత్​ను వణికించేందుకు వచ్చేసింది. కేరళలో మరోసారి ఈ వైరస్ కలకలం సృష్టిస్తోంది. కోజీకోడ్​లో ఇప్పటికే ఇద్దరు ఈ మహమ్మారి సోకి మరణించగా.. మంగళవారం రోజున మరో ఇద్దరికి నిఫా వైరస్  నిర్ధరణ కావడం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోజీకోడ్​ పొరుగు జిల్లాలైన​ కన్నూర్​, వయనాడ్​​, మలప్పురం జిల్లాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. కోజీకోడ్​ మెడికల్ కాలేజీలో 75 ఐసోలేషన్​ గదులను సిద్ధం చేసినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేరళలో నిఫా వైరస్​లో కనిపించే వేరియంట్​.. బంగ్లాదేశ్ వేరియంట్​ అని వెల్లడించారు.

లాంగ్యా హెనిపా వైరస్

కోజీకోడ్​ జిల్లాలో ఏడు గ్రామపంచాయతీలను కంటైన్​మెంట్​ జోన్​లుగా ప్రకటించినట్లు వీణా జార్జ్ చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 16 కమిటీలను ఏర్పాటు చేశామని.. ఈ నిఫా వైరస్ వేరియంట్​ మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుందని తెలిపారు. దీని మరణాల రేటు తక్కువగా ఉందని.. ఈ వేరియంట్ వ్యాప్తి కూడా తక్కువగానే ఉందని వెల్లడించారు. కంటైన్​మెంట్ జోన్​లను గుర్తించడం, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ గదుల ఏర్పాట్లు వంటి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news