రాహుల్ పై అనర్హత వేటు.. మరి ప్రజ్ఞా ఠాకూర్‌ సంగతేంటి ? : స్వర భాస్కర్‌

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై లోక్ సభ సచివాలయం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ స్పందించింది. రాహుల్ పై అనర్హత వేటు వేశారు.. కానీ ఇంకా ఎంపీగా కొనసాగుతున్న సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ సంగతేంటని ప్రశ్నించింది. మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్‌ ఇప్పటికీ ఎంపీగా ఎలా కొనసాగుతున్నారని ట్వీట్ చేసింది.

అచ్ఛే దిన్ అంటే ఒక ఉగ్రవాద నిందితురాలు దహనం, హింసను ప్రేరేపించడానికి పూర్తి స్వేచ్ఛనివ్వడమేనా.. ఒక ప్రత్యపక్ష నాయకుడు పార్లమెంటుకు అనర్హుడయ్యాడని గతంలో రష్యా, టర్కీ నుంచి వార్తలు వచ్చాయి. ఇప్పుడు భారత దేశంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, దాని వ్యవస్థలు కలిసి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా మారింది అని స్వర భాస్కర్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news