ఆ రాష్ట్రంలో ‘నో హెల్మెట్ నో పెట్రోల్’ విధానం..!

-

మనకు తెలిసినంత వరకు హెల్మెట్ ధరించని వాహనదారులకు భారీగా జరిమానా వేస్తారు. అంతేకాదు కేసులు నమోదు చేసుకొని వాహనాలను సీజ్ చేస్తుంటారు పోలీసు అధికారులు అయినా కూడా వాహనదారుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. ఇక హెల్మెట్ ధరించండి.. ధరించండి అంటూ రవాణాశాఖ ఎంత ప్రచారం చేసినా, చలానా విధిస్తామని హెచ్చరించినా కొంతమంది తమకేం పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో వారి పట్ల అధికారులు వారి దారిలోనే వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంటారు అధికారులు. ఇక ఎన్నిసార్లు తనిఖీలు చేసి హెచ్చరించిన హెల్మెట్ పెట్టుకోవట్లేదని పోలీసులు ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నో హెల్మెట్.. నో పెట్రోల్ అనే రూల్ ని ప్రవేశ పెట్టిన సంగతి అందరికి తెలిసిందే.

no-fuel
no-fuel

తాజాగా కల్‌కత్తాలో నో హెల్మెట్ నో పెట్రోల్ విధానాన్ని అమలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను నగర పోలీసు కమిషనర్ అంజూ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 8 నుంచి ఫిబ్రవరి 2, 2021 వరకు ఈ విధానం అమలులో ఉండనుంది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, హెల్మెట్ తో వస్తేనే పెట్రోల్ పోస్తారని కొల్‌కత్తా అధికారులు వెల్లడించారు.

అయితే పశ్చిమ బెంగాల్ లోని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ కొనలేని స్థితిలో ఉంటే దగ్గరిలోని పోలీస్ స్టేషన్లో వివరాలు ఇస్తే ప్రభుత్వమే హెల్మెట్ ఫ్రీగా ఇస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇతర ప్రభుత్వాల్లాగా వాహనదారులపై ఫైన్లు వేయకుండా… మేమే ఫ్రీగా హెల్మెట్లు అందిస్తామని ప్రకటించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ముఖ్యమంత్రి కోరారు. మాస్కులు కూడా తప్పనిసరిగా వాడాలని, ఒకవేళ బైక్ వెనకాల మరో ప్రయాణికుడు ఉంటే వారికి కూడా హెల్మెట్ తప్పనిసరి అని సూచించారు. హెల్మెట్ ఉంటేనే బంకుల్లో పెట్రోల్ పోస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news