ఇటీవలి కాలంలో కల్తీ తేనె ఎంతటి వివాదాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. దేశంలోని పలు ప్రముఖ బ్రాండ్లకు చెందిన కల్తీ అవుతుందని సైంటిస్టుల పరీక్షల్లో వెల్లడైంది. అయితే కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రస్తుతం మనం అనేక కల్తీ పదార్థాలను తెలియకుండానే కొంటున్నాం. ఇక తాజాగా షాకింగ్ వార్త తెలిసింది. బంగారం కూడా కల్తీ అవుతుందని గుర్తించారు.
ఢిల్లీలోని ది బులియన్ అండ్ జవెయిర్ అసోసియేషన్‌కు నిత్యం కల్తీ బంగారంపై వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈవిషయాన్ని సదరు అసోసియేషన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం కొందరు వ్యాపారులు బంగారంలో ఇరిడియం పౌడర్‌ను కలుపుతున్నారని దీంతో బంగారంలో కల్తీ జరిగిందా, లేదా అన్న విషయాన్ని గుర్తించడం కష్టతరమవుతోంది అన్నారు. దీన్ని ఆసరగా చేసుకుని కొందరు వ్యాపారులు కల్తీ బంగారాన్ని అమ్మతున్నారని తెలిపారు. కనుక వినియోగదారులు తాము కొనే బంగారం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా వ్యాపారులు 99.50 ప్యూరిటీ ఉన్న గోల్డ్‌ను ఢిల్లీలో అమ్మేవారు. కానీ ఇప్పుడు 99.30 వాతం ప్యూరిటీ ఉన్న గోల్డ్‌ను అమ్ముతున్నారని అన్నారు. దీని వల్ల కూడా బంగారంలో కల్తీని గుర్తించడం కష్టతరమవుతుందన్నారు. ప్రజలు ఈ విషయం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.