కేరళలోని కొచ్చిలో ఈ ఉదయం జరిగిన వరుస పేలుళ్ళు ఘటనలో ఒకరు మరణించారు. మరికొంతమందికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జమ్ర ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో క్రైస్తవుల ప్రార్థనల సందర్భంగా ఈ ఉదయం 9:40 గంటలకు ఈ ఘటన జరిగింది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే వరుస పేలుళ్లు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ATS టీం ఘటనాస్థలానికి చేరుకుంది. జమ్ర ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో వేదిక కుడివైపున ఈ పేలుడు సంభవించింది. ఇక ఈ పేలుడు సంభవించిన సమయంలో 2000 మందికి పైగా అక్కడ ఉన్నారు. ఇక గాయపడిన వారిలో పిల్లలు మరియు వృద్ధులు ఉన్నారు. ఈ పేలుళ్ల వెనుక ఉగ్ర వాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.