వాట్సప్‌ ఛానల్స్‌ అంటే ఏంటి..? వీటిని ఫాలో అవడం వల్ల ఏం జరుగుతుంది..?

-

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కొత్తగా ఛానెల్స్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. భారత్‌ సహా 150 దేశాల్లో ఈ ఫీచర్‌ను ప్రారంభించారు. ఇప్పటికే చాలా మందికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగిలిన వారికీ రానుంది. ఒకవేళ వాట్సప్‌ అప్‌డేట్‌ చేసుకోకపోయి ఉంటే లేటెస్ట్‌ వెర్షన్‌కు అప్‌డేట్‌ అవ్వండి. అసలు ఈ ఛానల్‌ అంటే ఏంటి..? దీని వల్ల ఏంటి ఉపయోగం.?

వాట్సాప్‌ ఛానెల్‌ అంటే?

ఇన్నాళ్లూ వాట్సప్‌ను పరస్పర కమ్యూనికేషన్‌ కోసం మాత్రమే వాడాం. ఆ తర్వాత గ్రూప్స్‌ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఛానెల్స్‌. ఈ ఫీచర్‌ ద్వారా మీకు నచ్చిన వ్యక్తులు, సంస్థలను ఫాలో అయ్యి వాట్సాప్‌లోనే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చు. అచ్చం ట్విటర్‌, ఇన్‌స్టాలో ఎలాగైతే మనకు నచ్చిన వారిని ఫాలో అవుతున్నామో అలానే. కావాలనుకుంటే ఈ అప్‌డేట్‌ను ఇతరులతో పంచుకోవచ్చు. మీరు ఫాలో అయినంత మాత్రానా మీ ఫోన్‌ నంబర్‌ ఎవరికీ కనిపించదు.

ఎలా ఫాలో అవ్వాలి..?

వాట్సప్‌లో మీకు ఛానెల్స్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చి ఉంటే స్టేటస్‌ ట్యాబ్‌ స్థానంలో అప్‌డేట్స్‌ (Updates) అని కనిపిస్తుంది. అక్కడ పై భాగంలో స్టేటస్‌లు కనిపిస్తాయి. కింద ఛానెల్స్‌ కనిపిస్తాయి. దిగువన మీకు ఫైండ్‌ ఛానెల్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇప్పటికే కత్రినా కైఫ్‌, అక్షయ్‌ కుమార్‌ వంటి బాలీవుడ్‌ ప్రముఖులతో పాటు పలు మీడియా సంస్థల ఛానెళ్లు మీకు కనిపిస్తుంటాయి కదా.!. పక్కనే ఉన్న ప్లస్‌ (+) సింబల్‌ క్లిక్‌ చేయడం ద్వారా ఛానెల్‌ను ఫాలో అవ్వొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం వాట్సాప్‌ ఛానల్‌లో చేరారు. కొన్నిగంటల్లోనే దాదాపు రెండున్నర లక్షల మంది ఆయన్ను అనుసరించడం విశేషం.

ఉదాహరణకు ‘మనలోకం’ లేటెస్ట్‌ న్యూస్‌ కోసం https://whatsapp.com/channel/0029Va9rRSX9Bb5y80ZkMy38 పై క్లిక్‌ చేయండి. పైన కనిపించే ఫాలో ఆప్షన్‌ క్లిక్‌ చేసి బెల్‌(🔔) ఐకాన్‌ను ట్యాప్‌ చేస్తే మనలోకం నుంచి వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు వాట్సవ్‌ ద్వారానే చూడవచ్చు.

ఛానెల్స్‌ ఆప్షన్‌ ద్వారా వ్యక్తులు సైతం తమ సొంత ఛానెల్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఛానెల్స్‌ పక్కనే ఉన్న ప్లస్‌ సింబల్‌ క్లిక్‌ చేస్తే క్రియేట్‌ ఛానెల్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. తర్వాత డీపీ, ఛానెల్‌ పేరు, ఛానెల్‌ డిస్క్రిప్షన్‌ పేర్కొని సింపుల్‌గా ఛానెల్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వారికి ఆ లింక్‌ను షేర్‌ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news