వామ్మో.. గాడిద పాలు లీట‌ర్ రూ.10వేలు .. అంత ప్ర‌త్యేక‌త ఏమిటి ?

-

మహారాష్ట్రలోని ఉమర్గాలో గాడిద పాలను లీటరుకు రూ.10,000 లకు విక్రయిస్తున్నారు. అక్క‌డ గాడిద పాలు అత్యంత‌ ప్రజాదరణ పొందాయి. దీంతో అత్యంత ఎక్కువ ధ‌ర‌కు అవి అమ్ముడ‌వుతున్నాయి. అక్క‌డ వ్యాపారులు ప్రస్తుతం 10 ఎంఎల్ పాల‌ను రూ.100కు విక్ర‌యిస్తున్నారు. దీంతో ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గాడిద పాలలో 80 శాతం లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది కడుపు నొప్పిని నివారించడంలో ప్రభావవంతంగా ప‌నిచేస్తుంది. ప‌లు వైద్య విధానాల ప్ర‌కారం.. గాడిద పాల‌ను గుండె జ‌బ్బులు, అంటు వ్యాధులు, లివ‌ర్ సంబంధ వ్యాధులు, జ్వ‌రం, ఉబ్బ‌సం వంటి వ్యాధుల‌ను త‌గ్గించేందుకు ఉప‌యోగిస్తారు. అందువ‌ల్లే గాడిద పాల‌కు అంత‌టి డిమాండ్ ఏర్ప‌డింది.

అయితే ఈ ఏడాది ఆ పాల‌కు ధ‌ర రెట్టింపు అయింది. గతేడాది లీట‌ర్ పాల‌కు రూ.5000 ధ‌ర ప‌లికింది. కానీ ఇప్పుడు ఏకంగా రూ.10వేలకు విక్ర‌యిస్తున్నారు. సాధార‌ణంగా ఆవు, మేక పాల‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కానీ గాడిద పాల‌లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అధికంగా ఉంటాయి. వెబ్ ఎండీ అనే వైద్యారోగ్య వెబ్‌సైట్ క‌థ‌నం ప్ర‌కారం.. గాడిద పాలు టైప్ 2 డ‌యాబెటిస్ చికిత్స‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పారు. అయితే దీన్ని శాస్త్రీయంగా ఇంకా నిరూపించ‌లేదు. ఇందుకు మ‌రిన్ని అధ్య‌య‌నాలు అవ‌స‌రం అని చెప్పారు.

ఆవు పాలు సాధార‌ణంగా కొంద‌రికి ప‌డ‌వు. అల‌ర్జీని క‌లిగిస్తాయి. కానీ గాడిద పాల‌లో అల‌ర్జీని క‌లిగించే ల‌క్ష‌ణాలు త‌క్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల చాలా మంది వీటిని తాగ‌వ‌చ్చు. గాడిద పాలు మ‌నుషుల పాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటాయ‌ని చెబుతారు. అందుక‌నే కొన్ని దేశాల్లో వీటిని పిల్ల‌ల‌కు ఆహారంగా కూడా ఇస్తారు. ఇక ఉబ్బ‌సం రాకుండా ఉండేందుకు చాలా చోట్ల పిల్ల‌ల‌కు గాడిద పాల‌ను తాగిస్తుంటారు.

ఒక గాడిద స‌గ‌టున రోజుకు ఒక లీట‌ర్ పాల‌ను ఇస్తుంది. ఆ పాల‌లో ఔషధ గుణాలు ఉంటాయి. అందువ‌ల్లే ఆ పాల ధ‌ర ఎక్కువ‌గా ప‌లుకుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news