అమ్మ ఫోన్‌కాల్‌ 25 మందిని కాపాడింది..!

Join Our Community
follow manalokam on social media

అమ్మా.. అనే పదం వింటేనే మరో ప్రాణం పుట్టుకొస్తుండి. ఆపత్కాలంలోనూ తన ప్రాణాలైన అడ్డేసి పిల్లల ప్రాణాలు కాపడుకుంటుంది. అది అమ్మ గొప్పతనం. అలాంటి తల్లి తన కుమారుడి ప్రాణాలు కాపాడేందుకు చేసిన తపన మరో 25 మంది బిడ్డల ప్రాణాలు కాపాడి ఆ తల్లుల కడుపుకోతను అడ్డుకున్న ఘటన ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ నెల 7న మంచు చరియలు విరిగి జలప్రళయం చోటు చేసుకున్న ఘటనలో తపోవన్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిగా ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఆ జలప్రళయంలో దాదాపుగా 200 మంది గల్లంతవ్వగా, అదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాలు దక్కించుకున్న వారిలో విపుల్‌ కైరేనీ టీం కూడా ఉంది.

పదేపదే ఫోన్‌కాల్స్‌..

విపుల్‌ విద్యుత్‌ కేంద్రలోని ఓ వాహనానికి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు దీనం కావడంతో ఆ రోజు పని చేస్తే రెట్టింపు కూలీ వస్తుందని ప్రమాదం జరిగిన ఉదయమే పనికి వెళ్లాడు. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు అతని తల్లి మాంగ్శ్రిదేవీ పలుమార్లు ఫోన్‌చేసింది. పదే పదే ఫోన్‌కాల్‌ రావడంతో వీపుల్‌ ఫోన్‌ ఎత్తగానే రానున్న ప్రమాదం గురించి కొడుకుకి వివరించింది. మొదటి తల్లి చెప్పిన మాటలను అంతగా పట్టించుకోని విపుల్‌ వెనువెంటనే ఫోన్లు చేయడంతో అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లాడు.

అమ్మమాట విన్నందుకే..

‘‘ కొండ ప్రాంతంలో మా ఊరు ఉంటుంది. మా అమ్మ ఇంటిబయట పని చేస్తుండగా దౌలిగంగ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నట్లు గుర్తించి నాకు ఫోన్‌ చేసింది. మొదట నేను ఆ విషయాన్ని నమ్మలేదు. పలుమార్లు ఫోన్‌ చేయడంతో నాతో పాటు మరో 24 మందిని అక్కడున్న ఓ ఎతైన ప్రాంతానికి చేరుకున్నాం. కాసేపటికే మేము పని చేస్తున్నట్లు ప్రాంతమంతా ఉద్ధృతంగా మారింది. అమ్మ ఫోన్‌ చేయకపోతే మా అమ్మతో పాటు మరో 24 తల్లులు తమ కొడుకులను పోగొట్టుకోవాల్సి వచ్చేదని’’ విపుల్‌ తెలిపాడు.

 

TOP STORIES

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా మొదలైంది?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మనందరికి తెలుసు. ఈ మహిళా దినోత్సవం వేడుకలు చేసుకోవడానికా? లేదా ఆందోళనలు నిర్వహించడానికా? అసలు దేనికోసం నిర్వహించుకుంటారో తెలుసా? శతాబ్దం కిందట...