ఒక పక్క కరోనా మహమ్మారి.. మరో పక్క పెరిగిపోతున్న ధరలతో సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. అసలే కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయి.. సంపాదన లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే.. ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టవన్నట్టు సామాన్యుడి మీద ధరల భారం మోపుతుంది. దీంతో ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా పోతుంది.
దేశవ్యాప్తంగా పెట్రోల్ , డిజీల్ ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్ 30 పైసలు డీజిల్ పై 26 పైసలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢీల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.77 కు చేరగా, డీజిల్ ధర రూ.73.93 కు చేరింది. గత 18 రోజుల్లోనే లీటర్ పెట్రోల్ ధర రూ. 2.65,డీజిల్ ధర రూ.3.40 పెరిగింది. ఒక్కో రాష్రంలో ఒక్కో విధమైన పన్నులు పసూలు చేస్తుండంతో ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి.