నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో 67.70 శాతం పోలింగ్‌ నమోదు

-

దేశవ్యాప్తంగా నాలుగో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 96 నియోజకవర్గాల్లో 1717 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, బంగాల్‌ మినహా అంతటా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో 67.70 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా బంగాల్‌లో 78.44 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యల్పంగా జమ్మూకశ్మీర్‌లో కేవలం 37.98 శాతం పోలింగ్‌ నమోదయింది.

నాలుగో విడతతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగిసింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్‌లో 8 చొప్పున,. బిహార్ లో 5, ఒడిశా, ఝార్ఖండ్ లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్ లోని ఒక లోక్ సభ నియోజకవర్గంలో నాలుగో విడతలో భాగంగా పోలింగ్ జరిగింది. నాలుగో విడత పోలింగ్‌లో కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, అర్జున్ ముండా, లోక్ సభలో కాంగ్రెస్ పక్షనేతగా పనిచేసిన అధీర్ రంజన్ చౌధరీ, తృణమూల్ నేత మహువా మొయిత్రా తమ అదృష్టం పరీక్షించుకున్నారు. మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ తృణమూల్ తరపున కాంగ్రెస్‌ నేత అధిర్ రంజన్ చౌదరిపై పోటీ చేశారు. కేంద్ర మాజీమంత్రి శత్రుఘ్న సిన్హా పశ్చిమ బంగాల్ లోని అసన్సోల్ నుంచి తృణమూల్ తరపున పోటీ చేశారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కన్నౌజ్‌ నుంచి అదృష్టం పరీక్షించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news