రైతులకి గుడ్ న్యూస్.. అకౌంట్ లోకి రూ.2 వేలు ఆరోజే..!

అన్నదాతలకు గుడ్ న్యూస్. త్వరలోనే మీ ఖాతాలో డబ్బులు పడనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పధకం వలన రైతులకి ఆర్ధికంగా ఇవి ప్లస్ అవుతాయి. డైరెక్ట్ గా ఈ డబ్బులు రైతుల ఖాతాలోకి రావడం జరుగుతుంది.

farmers

ఇది ఇలా ఉంటే పీఎం కిసాన్ డబ్బులు అందించేందుకు కేంద్రం మరోసారి సిద్ధం అవుతోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. పీఎం కిసాన్ కింద ఈసారి రైతులకు పదో విడత డబ్బులు రానున్నాయి. ఇప్పటికే రైతులకి తొమ్మది విడతల డబ్బులు అందాయి.

ఇక ఈ పదో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది చూస్తే.. రైతుల ఖాతాలోకి నేరుగా ఈ పదో విడత డబ్బులు డిసెంబర్ 15న అందనున్నట్టు తెలుస్తోంది. మోదీ సర్కార్ ఈ తేదీని లాక్ చేసినట్లు తెలిపాయి. కనుక ఈ డిసెంబర్ లో వారికి రెండు వేలు వస్తాయి. ఇది ఇలా ఉండగా ప్రతీ ఏడాది కూడా రైతులకి రూ.6 వేలు ఈ స్కీమ్ ద్వారా వస్తున్నాయి. అయితే ఇవి ఒకేసారి రావు. మూడు విడతల చొప్పున రైతులకి వస్తాయి. అలానే ఈ డబ్బులని రెట్టింపు చేసే అవకాశం కూడా కనపడుతోంది.