త్వరలోనే దక్షిణ భారత్‌కు బుల్లెట్‌ రైలు

-

దక్షిణ భారత ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే సౌత్ ఇండియాకు కూడా బుల్లెట్ రైలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అహ్మదాబాద్‌ – ముంబయి బుల్లెట్‌ రైలు పనులు శరవేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఉత్తర, దక్షిణ, తూర్పు భారత్‌లకూ ఈ రైళ్ల సేవలు విస్తరిస్తామని మోదీ హామీ ఇచ్చారు. వీటికి సంబంధించిన అధ్యయనం కూడా త్వరలోనే మొదలు కానుందని చెప్పారు.

అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ రైలు పనులు దాదాపు పూర్తి కావచ్చాయని మోదీ తెలిపారు. అదేవిధంగా తూర్పు, ఉత్తర, దక్షిణ భారత్‌కు ఒక్కోటి చొప్పున రానున్న బుల్లెట్‌ రైలుకు సంబంధించిన సర్వే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు సాధించిన అనుభవాలతో ఈ మూడు ప్రాంతాలకు బుల్లెట్‌ రైలు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు.

‘వందేభారత్‌ రైలు సర్వీసులను దేశంలోని ప్రతి మూలకూ విస్తరిస్తాం. వందేభారత్‌ స్లీపర్‌, ఛైర్‌కార్‌, మెట్రో అనే మూడు మోడళ్లలో దేశంలో ఇవి నడవనున్నాయి. వందేభారత్‌ సేవలు తొలిసారి ఫిబ్రవరి 2019లో ప్రారంభం అయ్యాయి. ఇప్పటివరకు 51 రైళ్లు దేశవ్యాప్తంగా పరుగులు తీస్తున్నాయి.’ అని మోదీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news