దేశానికి సేవ చేసేవారినే ప్రజలు ఆశీర్వదించారు: ప్రధాని మోదీ

-

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో భారత ప్రధానీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరాజయంతో కాంగ్రెస్‌ నేతలు అన్య మనస్కంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దేశ ప్రజల నిర్ణయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

పదేళ్లుగా సేవాభావంతో ఎన్డీయే ముందుకెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు చూపిన విశ్వాసం పట్ల గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేసేవారినే ప్రజలు ఆశీర్వదించారని పునరుద్ఘాటించారు. ఎన్డీయే పాలనను దేశ ప్రజలు మరోసారి సమర్థించారని పేర్కొన్నారు. రాజ్యాంగం ఆర్టికల్స్‌ అనుసరించేందుకే పరిమితం కాదని.. రాజ్యాంగం లైట్‌ హౌస్‌లా మార్గనిర్దేశనం చేస్తుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ భావనను విద్యా సంస్థల్లో విద్యార్థులకు చేరవేస్తున్నామని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోందన్న ప్రధాని మోదీ.. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్త ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు భవిష్య సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news