ప్రధాని అధ్యక్ష‌త‌న‌ ఈ నెల 30న అఖిలపక్ష సమావేశం

-

న్యూఢిల్లీ: ఈ నెలలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 30న అఖిల‌ప‌క్ష స‌మావేశం జ‌రుగ‌నుంది. దీనికి ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశం వీడియో కాన్ప‌రెన్స్ ద్వారా జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. కాగా, ఈ నెల 29 పార్ల‌మెంట్ ఈ ఏడాది మొద‌టి స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్ర‌వ‌రి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టనున్నారు. కాగా, బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌న‌వ‌రి 29న ప్రారంభ‌మై ఏప్రిల్ 8న ముగుస్తాయి. రెండు విడుత‌ల్లో జ‌ర‌గనున్న ఈ స‌మావేశాలు మొద‌టి విడుత జ‌నివ‌రి 29 నుంచి ఫిబ్ర‌వ‌రి 25కు వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్నాయి. రెండో విడుత స‌మావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వ‌ర‌కు జ‌ర‌గనున్నాయి.

ఇదిలా ఉండ‌గా, జ‌న‌వ‌రి 30న బీజేపీ నేతృత్వంలోని మిత్ర ప‌క్షాలు (ఎన్డీఏ ప‌క్షాలు) కూడా స‌మావేశం కానున్నాయి. పార్ల‌మెంట్‌లో ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తే అంశాలు, బ‌డ్జెట్ కు సంబందించిన అంశాలపై చ‌ర్చించే అవ‌కాశముంది. కాగా, క‌రోనా మ‌హ‌మ్మారి మార్గ‌ద‌ర్శ‌కాల కార‌ణంగా రాజ్య‌స‌భ ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఇక లోక్‌స‌భ స‌మావేశాలు సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కూ జ‌ర‌గ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news