దేశ రాజధాని ఢిల్లీ లో పోలీసులు హైఅలర్ట్..ఏ క్షణమైనా !

దేశ రాజధాని ఢిల్లీ లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఆగస్ట్‌ 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని ఢిల్లీ లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అంతేకాదు.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది.

దీంతో దేశ రాజధానిలో పదివేల మంది పోలీసులు మోహరించారు. ఆగస్ట్‌ 15 తేదీ అయిపోయే వరకు గాలి పటాలు, బెలూన్లు ఎగురవేయకుండా అడ్డుకునేందుకు 400 మంది సైనికులను దించింది ఇండియన్‌ ఆర్మీ. అలాగే ఎర్రకోట, ఢిల్లీ పోలీస్‌ కమాండ్ కంట్రోల్ చుట్టూ ఉన్న ఎత్తయిన భవనాలపై షార్ప్ షూటర్లు మోహరించారు. ఎర్రకోట చుట్టుపక్కల నో ఫ్లయింగ్‌ జోన్‌ అమలు చేస్తున్నారు. గాలిపటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగర వేయడంపై నిషేధం విధించారు పోలీసులు. 13 నుంచి ఢిల్లీ సరిహద్దులను పూర్తిగా మూసివేయనున్నారు పోలీసులు.